జమ్మూకశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. నలుగురు ఉగ్రవాదులు హతం

పాక్‌ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది. భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.

admin
Published on: 19 Nov 2020 9:48 AM IST
జమ్మూకశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. నలుగురు ఉగ్రవాదులు హతం
X

పదే పదే కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్‌ తూట్లు పొడుస్తూనే ఉంది. జమ్మూకశ్మీర్‌లోని బాన్‌ టోల్‌ప్లాజా దగ్గర భద్రతాదళాలపై పాక్‌ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన భద్రతాబలగాలు.. పాక్‌ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది. భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు.. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేసి.. జమ్మూకశ్మీర్‌లోని చెక్‌పోస్టుల దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు.

admin

admin

Next Story