కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు ఉగ్రవాదుల హతం

Arun Chilukuri
Updated on: 8 Jun 2020 10:24 AM IST
కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు ఉగ్రవాదుల హతం
X

జమ్ముకశ్మీర్‌లో భద్రతాదళాల కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్‌ జిల్లా పింజోరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారని సమాచారం మేర సోమవారం షోపియాన్ పోలీసులు సైనికులతో కలిసి గాలింపు చేపట్టారు. సైనికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో సైనికులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు.

ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు కూడా గాయపడ్డారు. పింజోరాకు 12 కి.మీ దూరంలో ఉన్న రెబన్‌ ప్రాంతంలో హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రసంస్థకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను ఆదివారం భద్రతా దళాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. మృతుల్లో ఓ హిజ్బుల్‌ కమాండర్‌ కూడా ఉన్నాడు. ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమైన ఎన్‌కౌంటర్‌ సుమారు 12 గంటలపాటు కొనసాగిందని అధికారులు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story