Bihar: అసదుద్దీన్ కు భారీ షాక్

Bihar: 2020లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 5 సీట్లు గెలుచుకొని సంచలనం సృష్టించిన మజ్లిస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.

Arun Chilukuri
Updated on: 29 Jun 2022 9:45 PM IST
Four AIMIM MLAs join RJD
X

Bihar: అసదుద్దీన్ కు భారీ షాక్

Bihar: 2020లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 5 సీట్లు గెలుచుకొని సంచలనం సృష్టించిన మజ్లిస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ తరఫున ఎన్నికైన నలుగురు ఎమ్మెల్యేలు RJD తీర్థం తీసుకున్నారు. మజ్లిస్ బిహార్ విభాగం అధ్యక్షుడు అఖ్తారుల్ ఇమాన్ తప్ప మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలు RJDలో చేరారు.

తేజస్వీ యాదవ్​ సమక్షంలో షానవాజ్, ఇజార్ అస్ఫీ, అంజార్ నైమీ, సయ్యద్ రుక్నుద్దీన్ RJD కండువా కప్పుకున్నారు. వీరందరినీ తన కారులో ఎక్కించుకొని స్వయంగా అసెంబ్లీకి తీసుకెళ్లారు తేజస్వీ యాదవ్. తాజా చేరికలతో RJD ఎమ్మెల్యేల సంఖ్య 80కి పెరిగింది. ఫలితంగా అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్నికల్లో RJD 75 స్థానాలు గెలుచుకుంది. ఉపఎన్నికల్లో మరో స్థానం తన ఖాతాలో వేసుకుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story