Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ కన్నుమూత

Sandeep Reddy
Updated on: 22 Aug 2021 10:44 AM IST
Former Uttar Pradesh CM Kalyan Singh is No More
X

ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ (ఫైల్ ఫోటో)

Uttar Pradesh: బీజేపీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ‌ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ మృతికి పలువురు ప్రముఖులు విచారణ వ్యక్తం చేశారు. లక్నోలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. కల్యాణ్ సింగ్ మరణ వార్త తెలియగానే యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ తన పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన లక్నోకు చేరుకున్నారు. అనంతరం కల్యాణ్ సింగ్ పార్థివదేహానికి నివాళులు అర్పించి ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు.

1932 జనవరి ఐదో తేదీన జన్మించిన కల్యాణ్ సింగ్ రెండు సార్లు ఉత్తరప్రదేశ‌ సీఎంగా, రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. 1992 డిసెంబర్ ఆరో తేదీన అయోధ్యలో వివాదాస్పద బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో యూపీ సీఎంగా ఉన్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story