నేడు యూపీ మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్‌ అంత్యక్రియలు

* గంగానది ఒడ్డున ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు

Sandeep Reddy
Updated on: 23 Aug 2021 11:00 AM IST
Former UP CM Kalyan Singh
X

నేడు యూపీ మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్‌ అంత్యక్రియలు (ట్విట్టర్ ఫోటో)

Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, రాజస్థాన్‌ మాజీ గవర్నర్‌, బీజేపీ సీనియర్‌ నేత కల్యాణ్‌ సింగ్‌ అంత్యక్రియలు ఇవాళ జరుగనున్నాయి. నరోరాలోని గంగానది ఒడ్డున ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. నిన్నమధ్యాహ్నం ఒంటిగంట వరకు అసెంబ్లీ సభా ప్రాంగణంలో ప్రజల సందర్శన కోసం అందుబాటులో పెట్టారు. ఆ తర్వాత మధ్యాహ్నం రెండున్నరకు బీజేపీ ఆఫీస్‌కు, అనంతరం అలీగఢ్‌లోని స్టేడియానికి తరలించారు. అక్కడి నుంచి నరోరాలోని గంగానది ఒడ్డుకు తరలించి ఇవ్వాళ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story