పార్లమెంట్ సభ్యులను వెంటాడుతున్న కరోనా.. స్పీకర్ ను సెలవు కోరిన పలువురు సభ్యులు

పార్లమెంట్ సభ్యులను వెంటాడుతున్న కరోనా.. స్పీకర్ ను సెలవు కోరిన పలువురు సభ్యులు
x
Highlights

Parliament monsoon session: దేశ చరిత్రలోనే అత్యంత ప్రత్యేక పరిస్థితుల నడుమ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. కరోనా మహమ్మారి సృష్టించిన...

Parliament monsoon session: దేశ చరిత్రలోనే అత్యంత ప్రత్యేక పరిస్థితుల నడుమ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. కరోనా మహమ్మారి సృష్టించిన విపత్కర పరిస్థితుల మధ్య, అనేక జాగ్రత్తల మధ్య జరుగుతున్న ఈ సమావేశాల కోసం అన్ని పార్టీల పార్లమెంట్ సభ్యులు కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. కాగా సెప్టెంబర్‌ 12న ప్రారంభమైన పార్లమెంట్‌ సమావేశాలకు ముందే లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు కరోనా పరీక్షలు నిర్వహించగా 17 మంది లోక్‌సభ, 8 మంది రాజ్యసభ ఎంపీలకు వైరస్‌ సోకినట్లు నిర్థారణ అయింది.

కాగా రాజ్యసభ ఎంపీలు సెలవులు కోరుతున్నారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ కు దరఖాస్తులు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా మరో 14 మంది ఎంపీలు సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు తమకు సెలవులు ఇవ్వాలంటూ ఎంపీలు తమ దరఖాస్తులో కోరారు. కాగా కోవిడ్‌-19 విసృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాజ్యసభ ఎంపీలు సెలవులు కోరినట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories