రాజ్యసభకు నామినేషన్‌ వేసిన మాజీ ప్రధాని దేవెగౌడ

రాజ్యసభకు నామినేషన్‌ వేసిన మాజీ ప్రధాని దేవెగౌడ
x
Highlights

మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ రాజ్యసభకు పోటీచేయనున్నారు. దేవెగౌడ ఇవాళ బెంగుళూరులో రాజ్యసభ కోసం నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన పెద్ద...

మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ రాజ్యసభకు పోటీచేయనున్నారు. దేవెగౌడ ఇవాళ బెంగుళూరులో రాజ్యసభ కోసం నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన పెద్ద కుమారుడు రేవణ్ణ, చిన్న కుమారుడు కుమారస్వామి తోడు రాగా ఆయన తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణిగా వ్యవహరిస్తోన్న కర్ణాటక అసెంబ్లీ సెక్రటరీ విశాలాక్షికి సమర్పించారు. దేశవ్యాప్తంగా 18 రాజ్యసభ స్థానాలకు జూన్‌ 19న ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్‌లో నాలుగు, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు స్థానాలు, రాజస్థాన్‌ మూడు, మధ్యప్రదేశ్‌లో మూడు స్థానాలు, జార్ఖండ్‌లో రెండు, మణిపూర్‌, మేఘాలయలో ఒక్కో స్థానం చొప్పున ఉన్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories