Manohar Joshi: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ జోషి కన్నుమూత

Former Maharashtra CM Manohar Joshi passes away
x

Manohar Joshi: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ జోషి కన్నుమూత

Highlights

Manohar Joshi: మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో.. లోక్‌సభ స్పీకర్‌గానూ సేవలు అందించిన మహారాష్ట్ర రాజకీయ దిగ్గజం

Manohar Joshi: మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్‌ జోషి కన్నుమూశారు. 86 ఏళ్ల వయసున్న ఆయన రెండు రోజుల క్రితం గుండెపోటుకు గురయ్యారు. ముంబయిలోని పీడీ హిందుజా హాస్పిటల్ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. కాగా గతేడాది మే నెలలో కూడా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మెదడులో రక్తస్రావం కావడంతో హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందారు. మనోహర్‌ జోషి శివసేన పార్టీలో అగ్రస్థాయి నేతగా ఎదిగారు.

1937లో నాంద్వీలో జన్మించిన జోషి ముంబైలో చదువుకున్నారు. తొలినాళ్లలో ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1967-77 మధ్యకాలంలో ముంబై మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక 1972లో మహారాష్ట్ర శాసనమండలికి ఎన్నికయ్యారు. మూడు సార్లు ఎమ్మెల్సీగా పనిచేశాక 1990లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. 1990-91 మధ్యకాలంలో మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. అంచెలంచెలుగా ఎదిగి 1995 నుంచి 1999 మధ్యకాలంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో శివసేన తరఫున పోటీ చేసి ముంబయి నార్త్‌-సెంట్రల్‌ సీటు నుంచి ఎంపీగా విజయం గెలిచారు. ఇక మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో 2002-2004 కాలంలో లోక్‌సభ స్పీకర్‌గానూ పనిచేశారు.నేడు ముంబైలో మాజీ సీఎం మనోహర్‌ జోషి అంత్యక్రియలు జరగనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories