అజారుద్దీన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

Arun Chilukuri
Published on: 30 Dec 2020 5:20 PM IST
అజారుద్దీన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
X

టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. న్యూఇయర్ వేడుకుల కోసం కుటుంబంతో కలిసి రాజస్థాన్ వెళ్తుండగా యాక్సిడెంట్‌ జరిగింది. అజారుద్దీన్ కారు బోల్తా కొట్టడంతో కుటుంబం మొత్తం స్వల్ప గాయాలతో బయటపడింది. రాజస్తాన్‌లోని సుర్వాల్‌కు చేరుకోగానే కారు అదుపుతప్పి పక్కనున్న రేకుల షడ్డులోకి దూసుకెళ్లి బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో అజారుద్దీన్‌ స్వల్ప గాయాలతో బయటపడగా కుటుంబసభ్యులు క్షేమంగా ఉన్నారు. కారు డ్రైవర్‌ బ్రేక్‌ వేసే సమయంలో వాహనం అదుపుతప్పి ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు పేర్కొన్నారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story