కాంగ్రెస్ కి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా

Sandeep Reddy
Updated on: 16 Aug 2021 1:26 PM IST
Former Congress Leader Sushmita Dev Going to Resign The Assam Congress Party
X

కాంగ్రెస్ పార్టీ (ఫోటో: ది హన్స్ ఇండియా) 

Sushmita Dev: అస్సాం మాజీ ఎంపీ, మహిళా కాంగ్రెస్ నేత సుష్మిత దేవ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ చీఫ్ గా పదవిలో ఉన్న సుష్మిత దేవ్ కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ క్లారిటీ ఇచ్చాడు. సుష్మిత దేవ్ రాజీనామా వార్త విషయం తనకి తెలియదని అస్సాం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ బోరా చెప్పడం.. సుష్మిత దేవ్ తన ట్విట్టర్ అకౌంటులో తన పదవుల అన్నింటికీ మాజీ జోడించడంతో అస్సాం రాజకీయాల్లో చర్చ మొదలైంది.


ఇక త్వరలోనే తను పార్టీ మారబోతుందని అందులో భాగంగానే సోమవారం సుష్మిత దేవ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటి అవబోతుందని, మంచి రోజు చూసుకొని తన అనుచరులతో తృణముల్ కాంగ్రెస్ లో చేరడం ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి.





Sandeep Reddy

Sandeep Reddy

Next Story