ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ దంపతుల అరెస్ట్

Former CEO Of ICICI Bank Chanda Kochhar Couple Arrested
x

ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ దంపతుల అరెస్ట్

Highlights

* వీడియోకాన్ గ్రూప్‌కు రుణాలు మంజూరు చేయడంలో.. అవినీతికి, అవకతవకలకు పాల్పడినట్టు వీరిపై ఆరోపణలు

ICICI Former CEO Arrested: ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వీడియోకాన్ గ్రూప్‌కు రుణాలు మంజూరు చేయడంలో అవినీతికి, అవకతవకలకు పాల్పడినట్టు నమోదైన కేసులో వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అవినీతి ఆరోపణల వల్లే 2018లో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో బాధ్యతల నుంచి చందా కొచ్చర్ వైదొలిగారు. బ్యాంక్ సీఈవో హోదాలో ఉన్న చందాకొచ్చర్ 2012లో వీడియోకాన్ గ్రూప్‌కు 3వేల250 కోట్ల రుణాన్ని మంజూరు చేశారు. ఆ తర్వాత అది ఎన్పీఏగా మారింది. దీనిపై విచారణ జరిపిన సీబీఐ. ఈ వ్యవహారం ద్వారా చందా కొచ్చర్ కుటుంబం లబ్ధి పొందిందని అభియోగాలు మోపింది. దీంతో కొచ్చర్ దంపతులను సీబీఐ అరెస్ట్ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories