మాజీ సీఎం తరుణ్‌ గొగోయ్ కన్నుమూత

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోయ్ మరణించారు.

Arun Chilukuri
Published on: 23 Nov 2020 8:12 PM IST
మాజీ సీఎం తరుణ్‌ గొగోయ్ కన్నుమూత
X

Assam CM Tarun Gogoi (file image)

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోయ్ మరణించారు. కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న తరువాత ఆయనకు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఈ నెల 2వ తేదీ నుంచి ఆయన గౌహతి వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నవంబర్ 21న ఒక్కసారిగా ఆయన ఆరోగ్యం విష‌మించింది. శ్వాస తీసుకోవ‌డానికి తీవ్రంగా ఇబ్బంది ప‌డుతుండ‌టంతో ఆయ‌న‌ను వెంటిలేట‌ర్‌పై ఉంచారు. ఆదివారం కొద్దిగా కోలుకున్న‌ట్లే క‌నిపించినా ఫలితం లేకుండా పోయింది.

86 సంవత్సరాల తరుణ్ గొగోయ్ మూడుసార్లు అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేశారు. వృద్ధాప్యం వల్ల క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కుమారుడు గౌరవ్ గొగోయ్ రాజకీయాల్లో ఉన్నారు. కాలియాబోర్ లోక్‌సభ స్థానానికి ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి విజయం సాధించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story