అస్సాం-మేఘాలయ సరిహద్దులో కాల్పులు.. ఆరుగురి మృతి..

Assam-Meghalaya Border Firing: అస్సాం - మేఘాలయ సరిహద్దులో కలకలం రేగింది.

Arun Chilukuri
Updated on: 22 Nov 2022 9:30 PM IST
Forest Official, 5 Others Killed In Assam-Meghalaya Border Firing
X

అస్సాం-మేఘాలయ సరిహద్దులో కాల్పులు.. ఆరుగురి మృతి..

Assam-Meghalaya Border Firing: అస్సాం - మేఘాలయ సరిహద్దులో కలకలం రేగింది. పశ్చిమ కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో కొందరు అక్రమంగా కలప స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అక్కడి చేరుకున్న పోలీసులు కలప తరలిస్తున్న వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. రెచ్చిపోయిన కలప స్మగ్లింగ్ ముఠా సభ్యులు పోలీసులపై దాడులకు దిగారు. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఓఫారెస్ట్ గార్డ్ సహా ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు స్థానికులు ఉండటం కలకలం రేపింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కలప స్మగ్లింగ్ ముఠా కోసం గాలింపు చేపట్టారు. పరిసర ప్రాంతల్లో గట్టి నిఘా పెట్టారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఈ ఘటనపై మేఘాలయ సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story