కరోనా కేసులు తగ్గకపోతే మళ్ళీ లాక్‌డౌన్‌ తప్పదు: మేయర్

Arun Chilukuri
Published on: 16 Feb 2021 8:45 PM IST
కరోనా కేసులు తగ్గకపోతే మళ్ళీ లాక్‌డౌన్‌ తప్పదు: మేయర్
X

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారా..? అవుననే అంటున్నాయి అక్కడి అధికారవర్గాలు. నగరంలో ప్రజలు కోవిడ్ నిబందనలు పాటించడం లేదని మేయర్‌ కిషోరి పండేకర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే మళ్లీ లాక్‌డౌన్ విధించాల్సి వస్తుందని హెచ్చరించారు. ముంబైలో పెరుగుతున్న కోవిడ్-19 పాజిటివ్ కేసులపై మంగళవారం అధికారులతో చర్చలు జరిపారు మేయర్‌. ప్రజల గురించి మాకు చాలా ఆందోళన ఉంది. రైళ్లలో ప్రయాణిస్తున్న వారిలో చాలా మంది మాస్క్‌లు ధరించడం లేదు. మనం మరోసారి లాక్‌డౌన్‌కి వెళ్లకూడదనుకుంటే ప్రజలు అన్ని రకాల కోవిడ్ నిబంధనలు పాటించాలి. మళ్లీ లాక్‌డౌన్ విధించడమా లేదా అనేది ప్రజల చేతుల్లోనే ఉందని మేయర్ స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story