రోడ్డు ప్రమాదం : ఒకదానికొకటి ఢీ కొన్న మొత్తం 15 వాహనాలు

Arun Chilukuri
Published on: 13 Feb 2021 2:30 PM IST
రోడ్డు ప్రమాదం : ఒకదానికొకటి ఢీ కొన్న మొత్తం 15 వాహనాలు
X

రోడ్డు ప్రమాదం : ఒకదానికొకటి ఢీ కొన్న మొత్తం 15 వాహనాలు 

ఉత్తర ప్రదేశ్ లోని ఫిరోజాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా- లక్నో జాతీయ రహదారిపై పొగ మంచు కారణంగా దారి కనిపించకపోవడంతో ఒకదానికొకటి మొత్తం 15 వాహనాలుఢీ కొన్నాయి. కొన్ని వాహనాలు ఒకదానిపై మరొకటి ఎక్కాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు గాయపడ్డవారిని సమీప ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ప్రమాదంలో ముందుగా ఒక బస్సు, బొలేరేను ఢీ కొట్టింది. బస్సులోని ప్రయాణికులు వెంటనే కిందకు దిగి రోడ్డుపై వెళుతున్న వాహనాలవారిని అలర్ట్ చేశారు. ముందుకెళ్లవద్దని గట్టిగా అరుపులు అరిచారు. దీంతో పలు వాహనాలు రోడ్డు ప్రమాదం బారి నుంచి తప్పించుకున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story