Assembly Elections 2021: రేపు మూడో దశ పోలింగ్‌

Assembly Elections 2021: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రేపు మూడో దశ పోలింగ్‌ జరగబోతోంది.

Samba Siva Rao
Published on: 5 April 2021 10:01 PM IST
Assembly Elections
X

అసెంబ్లీ ఎన్నికలు 

Assembly Elections 2021: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రేపు మూడో దశ పోలింగ్‌ జరగబోతోంది. అయితే కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఒకే దశలో రేపు పోలింగ్‌ జరుగుతుంది. అసోంలో రేపు మూడో దశ...చివరి దశగా పోలింగ్‌ ముగుస్తుంది. ఇక బెంగాల్్లో రేపు జరిగే పోలింగ్‌ కాకుండా...మరో ఐదు దశల పోలింగ్‌ ఉంటుంది. ఈ నెల 27వ తేదీ వరకు పోలింగ్‌ జరుగుతుంది. మే2వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. మరికొన్ని గంటల్లోనే పోలింగ్‌ ఉండటంతో ఓటర్లను మభ్యపెట్టేందుకు పెద్ద ఎత్తున నోట్లు పంచుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క తమిళనాడులో ఇంతవరకు 225 కోట్ల నగదును ఎన్నికల సందర్భంగా స్వాధీనం చేసుకున్నారు. మరో 176 కోట్ల బంగారు ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రతి పార్టీ ప్రత్యర్థి పార్టీలతో నగదు పంచుతున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నాయి.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story