Road Accident in UP: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..5గురి మృతి

Road Accident in UP: ఉత్తర ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందగా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

Kranthi
Updated on: 28 May 2021 12:20 PM IST
Five Killed and 3 Injured in Road Accident in Uttar Pradesh
X

Road Accident in UP:(File Image) 

Road Accident in UP: అతివేగంతో అదుపుతప్పి కారు రెండు బైక్‌లు, ఓ సైక్లిస్ట్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. ఈఘటన ఉత్తరప్రదేశ్‌ ఫతేపూర్‌లోని చౌరాసి ప్రాంతంలో జరిగింది. వాహనదారులను ఢీకొట్టిన అనంతరం కారు కలిమిట్టి దబౌలి సమీపంలోని ఓ చెట్టును ఢీకొట్టి గుంతలో పడిపోయిందని ఫతేపూర ఎస్పీ ఆనంద్ కులకర్ణి తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందినవారు ముగ్గురున్నారు. వారిని రాకేశ్‌ (35), అతడి తండ్రి రాజారామ్‌ (65), కుమారుడు రితిక్‌ (5)గా గుర్తించారు. ప్రమాదంలో మృతి చెందిన మరో ఇద్దరిని ఆశిష్ (25), సౌరభ్ (38)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ పరారయ్యాడని, అతడి కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు.

Kranthi

Kranthi

Next Story