HMPV Virus: భారత్ లో తొలి HMPV వైరస్ ఫస్ట్ నమోదు.. వైద్య, ఆరోగ్యశాఖ అలర్ట్

Dhivi
Updated on: 6 Jan 2025 10:38 AM IST
HMPV Virus: భారత్ లో తొలి HMPV వైరస్ ఫస్ట్ నమోదు.. వైద్య, ఆరోగ్యశాఖ అలర్ట్
X

HMPV Virus: కోవిడ్ పీడ పోయిందంటే మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది చైనాలో. హెచ్ఎంపీవీ పేరుతో ఇప్పటికే యాక్టివ్ గా ఉన్న కేసులు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాయి. అయితే ఈ వైరస్ మన దేశంలో తొలి కేసు నమోదు అవ్వడంతో అందరి గుండెల్లో గుబులు మొదలైంది. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో శిశువులో హెచ్ఎంపీవీ వైరస్ గుర్తించారు. నగరంలోఇదే మొదటి కేసు కావడంతో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. చిన్నారికి హెచ్ఎంపీవీ వైరస్ పాజిటివ్ లక్షణాలు ఉన్నాయని..తొలి కేసు నమోదు అయినట్లు కర్నాటక వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

Dhivi

Dhivi

Next Story