Babri mosque: అయోధ్యలో కొత్తగా నిర్మించే బాబ్రీ మసీదుకు మొట్టమొదటి ఇటుకను పాకిస్తాన్ ఆర్మీ వేస్తుందా?

Babri mosque
x

Babri mosque: అయోధ్యలో కొత్తగా నిర్మించే బాబ్రీ మసీదుకు మొట్టమొదటి ఇటుకను పాకిస్తాన్ ఆర్మీ వేస్తుందా?

Highlights

Babri mosque: ఈ పరిణామాల మధ్య, పాకిస్థాన్ నాయకులు చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు ఆ దేశ ఉగ్ర మద్దతు ధోరణిని మరోసారి ప్రపంచం ఎదుట ఉంచుతున్నాయి.

Babri mosque: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్–పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పీక్స్‌కి చేరిన వేళ, పాకిస్తాన్‌ పార్లమెంట్‌లో ఓ సెనేటర్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చలకు దారి తీస్తున్నాయి. పాకిస్తాన్‌ సెనేటర్‌ పల్వాషా మోహమ్మద్ జై ఖాన్‌ మాట్లాడుతూ, అయోధ్యలో కొత్తగా నిర్మించే బాబ్రీ మసీదుకు మొట్టమొదటి ఇటుకను పాకిస్తాన్ ఆర్మీ వేస్తుందని ప్రకటించడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తుతోంది.

ఆమె చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్ మునీర్ స్వయంగా తొలి అజాన్ ఇస్తారని ఆమె పేర్కొనడం మరింత వివాదాస్పదంగా మారింది. పాక్‌ భద్రతా వ్యవస్థను కించపరిచేలా వ్యాఖ్యలు చేయకూడదన్న ప్రమాణాన్ని తుంగలో తొక్కినట్టుగా ఆమె వ్యాఖ్యలు నిలిచాయి.

ఇంతటితో ఆగకుండా, భారత్‌పై తాము బెదిరింపులకు లొంగబోమని, తమ ఆర్మీలోని సిక్ సైనికులు పాకిస్తాన్‌పై దాడి చేయబోరని ఆమె అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. గురునానక్ భూమి అయిన పాక్‌పై సిక్కులు దాడి చేయరు అని పేర్కొంది. ఇదే సమయంలో పీపుల్స్ పార్టీ నేత బిలావల్ భుట్టో కూడా ఇండస్ వాటర్స్ ఒప్పందం రద్దుపై వ్యాఖ్యలు చేస్తూ, ఇండస్ నదిపై హక్కు తమదేనని, నీరు లేకపోతే భారతీయుల రక్తం ప్రవహిస్తుందని తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. భారత్ యూనిలెటరల్‌ నిర్ణయం తీసుకున్నట్టు ఆరోపించారు.

ఇక మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా తాజాగా స్పందిస్తూ, పాక్ శాంతిని కోరుకుంటుందని కానీ దాన్ని బలహీనతగా భావించవద్దని స్పష్టం చేశారు. 2019లో జరిగిన ఘర్షణ సమయంలో తాము చూపిన ప్రతిస్పందనకే దేశం సాక్షి అని అన్నారు. ఈ పరిణామాల మధ్య, పాకిస్థాన్ నాయకులు చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు ఆ దేశ ఉగ్ర మద్దతు ధోరణిని మరోసారి ప్రపంచం ఎదుట ఉంచుతున్నాయి. భారత్ ఇప్పటికే ఈ పరిస్థితులపై దౌత్యస్థాయిలో స్పందిస్తూ, అంతర్జాతీయంగా మద్దతు కూడగడుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories