Amritsar:‎ గురునానక్‎ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం

Punjab: పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన గురునానక్‌దేవ్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 14 May 2022 6:48 PM IST
Fire Broke out in the Guru Nanak Dev Hospital in Amritsar
X

Amritsar:‎ గురునానక్‎ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం

Punjab: పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన గురునానక్‌దేవ్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దాంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగి ఆసుప్రతిలోకి వ్యాప్తించడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఆసుపత్రిలోని రోగులందరినీ అక్కడి నుంచి తరలించారు.

ఇక పార్కింగ్‌లోని వాహనాలు దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలంలో ఎనిమిది ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చింది. ఘటనపై పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. దేవుడి దయవల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. కాగా నిన్నటి ఢిల్లీ ఘటన మరవకముందే ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story