Top
logo

సీరం బిల్డింగ్‌లో భారీ అగ్నిప్రమాదం

Fire breaks out at Serum Institute of India
X
Highlights

ప్రముఖ ఫార్మా సంస్థ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కేంద్రంలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది....

ప్రముఖ ఫార్మా సంస్థ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కేంద్రంలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పుణెలోని మంజ్రీ ప్రాంతంలో గల ఈ ప్లాంట్‌లోని టర్మినల్‌ 1 గేట్‌ వద్ద పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సంస్థ కొవిషీల్డ్‌ టీకాలను తయారుచేస్తోన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ ప్లాంట్‌ నిర్మాణ దశలో ఉందని, ఇక్కడ టీకాల ఉత్పత్తి జరగట్లేదని సంస్థ వర్గాలు వెల్లడించాయి.

Web TitleFire breaks out at Serum Institute of India
Next Story