Fire Accident: ముంబైలో భారీ అగ్నిప్రమాదం

Fire Accident: 20 అంతస్తుల కమలా బిల్డింగ్‌లో ప్రమాదం

Rama Rao
Published on: 22 Jan 2022 10:52 AM IST
Fire Accident in Mumbai | National News Today
X

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

Fire Accident: ముంబయిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించినట్లు అధికారులు తెలిపారు. మరికొంత పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సెంట్రల్‌ ముంబయిలోని తాడ్‌దేవ్‌ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బృహత్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని గాంధీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న 20 అంతస్తుల కమలా భవనంలోని 18వ అంతస్తులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక బృందాలు సహా ఇతర సహాయక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.

అప్పటికే పలువురు తీవ్రంగా గాయపడడంతో వారిని స్థానిక భాటియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో 15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం 13 ఫైర్‌ ఇంజిన్లు, 7 వాటర్‌ జెట్టీలు మంటల్ని అదుపులోకి తెచ్చాయి. భారీ ఎత్తున పొగ అలముకోవడంతో భవనంలోని వారిని పోలీసులు ఖాళీ చేయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Rama Rao

Rama Rao

Next Story