రైతుల ఆందోళనపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

రైతుల ఆందోళనపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
x
Highlights

ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నా చేస్తున్న రైతులను ఖాళీ చేయించాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఢిల్లీకి చెందిన రిషబ్‌ శర్మ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు....

ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నా చేస్తున్న రైతులను ఖాళీ చేయించాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఢిల్లీకి చెందిన రిషబ్‌ శర్మ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు రైతు సంఘాలకు నోటీసులు జారీ చేసింది. రైతుల సమస్య జాతీయ ప్రాధాన్యత అంశమన్న ధర్మాసనం తొలుత కేంద్రానికి నోటీసులు ఇచ్చింది.

అదేవిధంగా సమస్య పరిష్కారం కోసం కేంద్రానికి నాలుగు ప్రతిపాదనలు సూచించింది ధర్మాసనం. రెండు వర్గాల మధ్య చర్చలు జరగాలని దీనికి గాను మధ్యవర్తుల బృందాన్ని ఏర్పాటు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలియజేసింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.


Show Full Article
Print Article
Next Story
More Stories