దేశవ్యాప్తంగా నేడు రైతుల రైల్‌‌రోకో..

దేశవ్యాప్తంగా నేడు రైతుల రైల్‌‌రోకో..
x

దేశవ్యాప్తంగా నేడు రైతుల రైల్‌‌రోకో..

Highlights

ఇవాళ దేశ వ్యాప్తంగా రైల్‌‌రోకో నిర్వహించడానికి సంయుక్త కిసాన్ మోర్చా సిద్ధమవుతోంది. సాగు చట్టాలను రద్దు చేయాలంటూ ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల...

ఇవాళ దేశ వ్యాప్తంగా రైల్‌‌రోకో నిర్వహించడానికి సంయుక్త కిసాన్ మోర్చా సిద్ధమవుతోంది. సాగు చట్టాలను రద్దు చేయాలంటూ ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు రైల్‌రోకో నిర్వహించనున్నారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడానికి ఆర్‌పీఎస్ఎఫ్‌ సిద్ధమవుతోంది. సుమారు 20 వేల మందిని దేశ వ్యాప్తంగా మోహరించనుంది.

ఢిల్లీ సరిహద్దుల్లో 84 రోజులుగా రైతు ఉద్యమం కొనసాగుతోంది. పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణా, పశ్చిమబెంగాల్‌లపై ప్రత్యేక దృష్టి సారించింది. నిరసనలు శాంతియుతంగా తెలపాలని, దీనిపై జిల్లా యంత్రాంగాలతో సమన్వయంతో వెళ్లనున్నామని ఆర్‌పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ అరుణ్‌కుమార్‌ తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories