రైతు సంఘాలతో ముగిసిన కేంద్రం చర్చలు

X
Highlights
తొమ్మిదోసారి కూడా చర్చలు ఫలించలేదు. రైతుల సంఘాల ప్రతినిధులతో కేంద్రం జరిపిన చర్చలు మరోసారి అసంపూర్తిగానే...
Arun Chilukuri15 Jan 2021 12:31 PM GMT
తొమ్మిదోసారి కూడా చర్చలు ఫలించలేదు. రైతుల సంఘాల ప్రతినిధులతో కేంద్రం జరిపిన చర్చలు మరోసారి అసంపూర్తిగానే ముగిశాయి. ఎప్పటిలాగే, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. చట్టాల్లో సవరణలు మాత్రమే చేస్తామని, రద్దు చేసే ప్రసక్తే లేదని కేంద్రం మళ్లీ పాత మాటే తేల్చిచెప్పింది. అయితే, ఆశలు లేవంటూనే చర్చలకు వెళ్లిన రైతు ప్రతినిధులు కేంద్రం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వ్యవసాయ చట్టాల రద్దు తప్ప మరో పరిష్కారం లేదని రైతు సంఘాల నేతలు మరోసారి తేల్చిచెప్పారు. మరోవైపు, జనవరి 26న ఢిల్లీలో పెద్దఎత్తున కిసాన్ రిపబ్లిక్ పరేడ్ నిర్వహించనున్నట్లు రైతు సంఘాలు ఇప్పటికే స్పష్టం చేశాయి.
Web TitleFarmers Protest: Ninth round of govt-farmer talks End
Next Story