రైతులు, కేంద్రం మధ్య ప్రారంభమైన 8వ విడత చర్చలు

రైతులు, కేంద్రం మధ్య ప్రారంభమైన 8వ విడత చర్చలు
x
Highlights

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. సింఘు సరిహద్దు...

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. సింఘు సరిహద్దు ప్రాంతాల్లో రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక ఈ సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే పలుసార్లు కేంద్రం, రైతుల మధ్య చర్చలు జరిగినా విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి చర్చలకు సిద్ధమయ్యారు. ఎనిమిదో సారి రైతులు, కేంద్రం మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. 40 రైతు సంఘాల ప్రతినిధులతో జరుగుతున్న చర్చల్లో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్‌ గోయల్‌ పాల్గొన్నారు. చర్చలకు ముందుకు అమిత్ షాతో సమావేశమయ్యారు వ్యవసాయ శాఖ మంత్రి తోమర్. చర్చల్లో పురోగతి వుంటుందనే ఆశాభావంతో వున్నామని చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరుగుతాయనే విశ్వాసంతో వున్నామన్నారు తోమర్.

Show Full Article
Print Article
Next Story
More Stories