logo
జాతీయం

ఢిల్లీ సరిహద్దుల్లో మళ్లీ యుద్ధ వాతావరణం

ఢిల్లీ సరిహద్దుల్లో మళ్లీ యుద్ధ వాతావరణం
X

ఢిల్లీ సరిహద్దుల్లో మళ్లీ యుద్ధ వాతావరణం

Highlights

*ఆందోళనలను తీవ్రతరం చేస్తోన్న రైతులు *కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం *ఢిల్లీ సరిహద్దుల్లో సీఆర్పీఎఫ్ బలగాల మోహరింపు పొడిగింపు

ఢిల్లీలో రైతుల ఆందోళనలు ఉదృతం అవుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ సరిహద్దులకు భారీగా రైతులు తరలి రావడంతో సీఆర్పీఎఫ్ బలగాలను మరో రెండు వారాల పాటు పొడిగించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. రైతుల ఆందోళనలలో పంజాబ్, హర్యానా రైతులకు మరో మూడు రాష్ట్రాల రైతులు జత కలిశారు. దానికి తోడు ప్రతిరోజు సరిహద్దులకు రైతులు భారీగా తరలి వస్తున్నారు. దాంతో ఢిల్లీ సరిహద్దులు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సీఆర్పీఎఫ్ బలగాలను మరో రెండు వారాల పాటు పొడిగించాలనే నిర్ణయం తీసుకుంది.


Web TitleFarmers Protest: Deployment of CRPF companies for Delhi-NCR extended for 2 more weeks
Next Story