ఆగని అన్నదాత ఆందోళన..పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయనున్న..

ఆగని అన్నదాత ఆందోళన..పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయనున్న..
x
Highlights

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో గత కొద్దిరోజులుగా ఉద్యమం చేస్తున్న అన్నదాతలు ఏ మాత్రం పట్టువీడట్లేదు. వణికించే చలిని కూడా లెక్కచేయకుండా...

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో గత కొద్దిరోజులుగా ఉద్యమం చేస్తున్న అన్నదాతలు ఏ మాత్రం పట్టువీడట్లేదు. వణికించే చలిని కూడా లెక్కచేయకుండా వరుసగా 21వ రోజు హస్తిన సరిహద్దుల్లో తమ ఆందోళన సాగిస్తున్నారు. చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన కొనసాగిస్తున్న రైతులు తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తున్నారు. ఢిల్లీ- నోయిడా మధ్య ఉన్న చిల్లా సరిహద్దును ఇవాళ పూర్తిగా బ్లాక్‌ చేస్తామని ప్రకటించారు.

నూతన వ్యవసాయ చట్టాలను చాలా రాష్ర్టాల్లో స్వాగతిస్తున్నారని, ప్రతిష్టంభనను తొలిగించేందుకు 'నిజమైన రైతు సంఘాల'తో చర్చలు కొనసాగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని కేంద్ర మంత్రి తోమర్‌ తెలిపారు. కనీస మద్దతు ధరల విధానం ఇకపైనా కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన భారతీయ కిసాన్‌ యూనియన్‌కు చెందిన ప్రతినిధులు తోమర్‌ను కలిసి వ్యవసాయ చట్టాలపై సూచనలు అందజేశారు. మరోవైపు, వ్యవసాయ చట్టాలను రద్దుచేసేంత వరకు విశ్రమించబోమని రైతు సంఘాల నేతలు స్పష్టంచేశారు. ఢిల్లీ, నోయిడా మధ్యనున్న చిల్లా సరిహద్దును ఇవాళ దిగ్బంధించనున్నట్టు తెలిపారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని తాము అడుగుతుంటే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చల నుంచి తాము ఎక్కడికీ పారిపోవడం లేదని చెప్పారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిగణనలోకి తీసుకొని ఆమోద యోగ్యమైన ప్రతిపాదనలతో ముందుకు రావాలని కోరారు.

ఈ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అన్నదాతలకు ఈనెల 20న నివాళులర్పించాలని నిర్ణయించారు. ఈ పోరాటంలో అమరులైన అన్నదాతలకు డిసెంబర్‌ 20న ఉదయం 11 గంటల నుంచి ఒంటిగంట వరకు దేశవ్యాప్తంగా శ్రద్ధాంజలి ఘటించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి సగటున రోజుకు ఒక రైతు ప్రాణాలు కోల్పోయినట్టు ఆవేదన వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories