రేపు కేంద్రంతో మరోసారి చర్చలు జరపనున్న రైతులు

Arun Chilukuri
Updated on: 7 Jan 2021 9:15 PM IST
రేపు కేంద్రంతో మరోసారి చర్చలు జరపనున్న రైతులు
X

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలు రైతులు మరింత ఉద్ధృతం చేసారు. 43రోజులుగా చలి, వర్షాలను లెక్కచేయకుండా చట్టాల రద్దు డిమాండ్‌కే పట్టిన పట్టు వీడడం లేదు. ఇప్పటికే ఏడు విడతలు చర్చలు జరిగినా ఆశించిన ఫలితం రాలేదు. దీంతో ఢిల్లీకి నాలుగు సరిహద్దులవైపు ట్రాక్టర్ల ర్యాలీలను చేపట్టారు. సుమారు 40రైతు సంఘాల నేతలు దీనిలో పాల్గొన్నారు. ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌ వాహనదారులకు అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు. నిన్ననే ర్యాలీని తలపెట్టాలని భావించినప్పటికీ వర్షం కారణంగా వాయిదా పడింది.

రేపు కేంద్రం, రైతు సంఘాలు మరోసారి సమావేశం కానున్నాయ్. ఇలాంటి తరుణంలో భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. రేపు కూడా విఫలం అయితే పరిస్థితి ఎలా ఉండబోతుందో ఆందోళనలు ఎలా చేస్తామో అన్నట్లుగా ర్యాలీ నిర్వహించారు రైతులు. ఇక అటు రిపబ్లిక్ డే రోజు కిసాన్ పరేడ్ పేరుతో నిర్వహించనున్న భారీ ర్యాలీకి ఇది సన్నాహకంగా ఉంటుందని రైతు సంఘాలు చెప్పాయ్. మరోవైపు వ్యవసాయ చట్టాలపై దాఖలైన అన్ని పిటిషన్లపై ఈ నెల 11న విచారణ జరపనున్నట్లు సుప్రీం కోర్టు ప్రకటించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story