Bharat Bandh: మార్చి 26న భారత్ బంద్

Farmer Unions Calls for Bharat Bandh on March 26th
x

ధర్నా చేస్తున్న రైతులు (ఫైల్ ఫొటో)

Highlights

Bharat Bandh: ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటం చేస్తున్న రైతు సంఘాలు కేంద్రం తీరుపై మండిపడుతున్నాయి.

Bharat Bandh: వ్యవసాయ చట్టాలపై ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటం చేస్తున్న రైతు సంఘాలు.. కేంద్రం ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నాయి. ఈ మేరకు తమ తదుపరి కార్యచరణను వెల్లడించాయి. ఈ నెల 26న భారత్ బంద్ చేయనున్నట్లు పేర్కొన్నాయి. తాము చేస్తున్న ఆందోళనలను మార్చి 26 వ తేదీ నాటికి నాలుగు నెలలు పూర్తవుతాయని, ఈ నేపథ్యంలో సంపూర్ణంగా భారత్ బంద్ నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు రైతు నాయకుడు బూటా సింగ్ అన్నారు.

ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు శాంతియుతంగా బంద్‌ను కొనసాగిస్తామని తెలిపారు. అలాగే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ట్రేడ్ యూనియన్లు చేపడుతున్న ఆందోళనల్లోనూ పాల్గొంటామని స్పష్టం చేశారు. మార్చి 29 న హోలీకా దహన్ పేరిట కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వ్యవసాయ చట్టాల ప్రతులను కాల్చి నిరసన తెలియజేస్తామని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories