Mumbai Fake Teacher ID Scam: మహారాష్ట్రలో ఫేక్ టీచర్ల ఐడీ కుంభకోణం..ఒక్కో టీచర్ పోస్ట్‌కు రూ.20 నుంచి రూ.30 లక్షలు.. పోర్టల్‌లో రూ. 3 వేల కోట్లు స్కామ్.. మోసానికి పాల్బడిన ఇద్దరు సీనియర్ అధికారులు అరెస్ట్

Mumbai Fake Teacher ID Scam
x

Mumbai Fake Teacher ID Scam: మహారాష్ట్రలో ఫేక్ టీచర్ల ఐడీ కుంభకోణం..ఒక్కో టీచర్ పోస్ట్‌కు రూ.20 నుంచి రూ.30 లక్షలు.. పోర్టల్‌లో రూ. 3 వేల కోట్లు స్కామ్.. మోసానికి పాల్బడిన ఇద్దరు సీనియర్ అధికారులు అరెస్ట్

Highlights

Mumbai Fake Teacher ID Scam: మహారాష్ట్రలో జరిగిన నకిలీ టీచర్ల ఐడీ స్కామ్‌పై ధర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం( సిట్) ఎన్నో ఆశ్చర్యకర విషయాలు బయటపెట్టింది.

Mumbai Fake Teacher ID Scam: మహారాష్ట్రలో జరిగిన నకిలీ టీచర్ల ఐడీ స్కామ్‌పై ధర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం( సిట్) ఎన్నో ఆశ్చర్యకర విషయాలు బయటపెట్టింది. నిర్దేశించిన విధానాలను పాటించకుండా వందల మంది ఉపాధ్యాయులకు ఫేక్ ఐడీలు ఇచ్చి నియమించినట్లు వెల్లడైంది. ఈ స్కామ్‌లో ఒక్కో టీచర్ పోస్ట్‌కు రూ. 20 లక్షల నుండి రూ.30 లక్షల వరకు డబ్బులు తీసుకున్నట్లు కూడా సిట్ తెలిపింది. వివరాల్లోకి వెళితే..

గత కొన్ని నెలలుగా నాగ్‌పూర్, మహారాష్ట్రలను శలార్డ్ ఫేక్ ఐడీ టీచర్ల కుంభకోణం కుదిపేస్తుంది. దీనిపై ధర్యాప్తు చేస్తున్న సిట్ తాజాగా ఎన్నో కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వంలోని సీనియర్ విద్యా అధికారులు నకిలీ ఉపాధ్యాయుల ఐడీలను సృష్టించడానికి, ప్రభుత్వం నిర్వహించే చెల్లింపుల పోర్టల్‌ను దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. పాఠశాల నిర్వహణ మరియు విద్యా శాఖ అధికారులకు ఒక్కొక్కరికి రూ. 20 నుండి 30 లక్షల లంచం ఇచ్చిన తర్వాత అర్హత లేని వ్యక్తులను నియమించారని కూడా ఆరోపించారు.

ఉపాధ్యాయుల్ని నియమించినప్పుడు ఇచ్చే ఐడీలు జీతం మరియు ఇతర ప్రయోజనాలను పొందడానికి అవసరం పడుతుంది. ముంబై మరియు నాగ్‌పూర్ జోన్‌ల విద్యా డిప్యూటీ డైరెక్టర్లు వేల సంఖ్యలో నకిలీ ఐడీలను సృష్టించారని ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభకోణం రూ. 2,000 - 3,000 కోట్లు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ స్కామ్‌లో ఇప్పటికే కొంతమంది అరెస్టు చేసినట్లు కూడా తెలుస్తోంది.

ఫేక్ టీచర్ ఐడీ కార్డ్ అంటే ఏంటి?

టీచర్లకు ఇచ్చే నకిలీ ఐడీ కార్డు అని అర్ధం. అన్న విధాలుగా, నిబంధనల ప్రకారం ఎంపికైన కొంతమందికి టీచర్ పోస్ట్ దక్కుతుంది. ఇలా టీచర్ పోస్ట్ వచ్చిన వారికి ప్రభుత్వం నుంచి ఒక ఐడీ కార్డు వస్తుంది. దీని ప్రకారమే వాళ్లకు జీతాలు, ఇతర ప్రయోజనాలు కలుగుతాయి. అయితే నిజాయితీగా కాకుండా తీసుకునే ఐడీ కార్డుని ఫేక్ ఐడీ కార్డు అని అంటారు. నకిలీ టీచర్ ఐడీ కార్డులు సృష్టించినా, ఉపయోగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

ఐడీ స్కామ్‌ను శలార్త్ ఎలా చేసింది?

శలార్త్ ఐడి స్కామ్ అనేది మహారాష్ట్ర, నాగపూర్‌‌లలో జరిగిన ఒక పెద్ద కుంభకోణం. దీనిలో వందల మంది టీచర్లు నిబంధనలు పాటించకుండా టీచర్ పోస్టులు దక్కించుకున్నారు. ఈ స్కామ్ విలువ రూ. 2వేల కోట్ల నుంచి రూ.3 వేల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ స్కామ్‌లో ముఖ్యంగా శలార్త్ అనే ప్రభుత్వ పోర్టల్‌ ద్వారా ఉపాధ్యాయులను నియమించడంలో అవకతవకలు జరిగాయి. ఈ శలార్ద్ అనేది ప్రభుత్వం అదేవిధంగా ప్రభుత్వ సహాయక పాఠశాలల సిబ్బంది యొక్క జీతాలు ఇతర సేవా రికార్డులను నిర్వహిస్తుంటుంది. ఇది మహారాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించే ఒక పోర్టల్. అయితే మాజీ డిప్యూటీ డైరెక్టర్‌‌ రామ్ పవార్ ప్రకారం, షాలార్థ్ ఐడీలను జారీ చేసే అధికారం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్‌పై ఉంటుంది.

ప్రభుత్వం ఏం చెబుతోంది?

జూలై 18న, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీలో షాలార్థ్ ఐడి కుంభకోణం రూ. 2,000-3,000 కోట్లు ఉండవచ్చని ప్రకటించారు. ఐడి స్కామ్‌ను దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు రాష్ట్ర పాఠశాల విద్యా మంత్రి దాదా భూసే ముంబై డిప్యూటీ డైరెక్టర్ సందీప్ సంగవేను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా, రికార్డులను పరిశీలించడానికి తీవ్రంగా కృషి చేయాలి. ఎవరూ ఎలాంటి అడ్డంకులు తీసుకొచ్చినా... తనిఖీలు కఠినంగా నిర్వహించాల్సిన బాధ్యత ఫీల్డ్ అధికారులపైనే ఉందని డిప్యూటీ డైరెక్టర్ రామ్ పవార్ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories