Coronavirus : ఇది ఫేక్ మందు..

Coronavirus : ఇది ఫేక్ మందు..
x
fake news
Highlights

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే.. కరోనాకు భయపడని దేశం అంటూ లేదు.

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే.. కరోనాకు భయపడని దేశం అంటూ లేదు. లక్షలాది కేసులు, వేలాది మరణాలతో ప్రపంచాన్ని వణికిస్తోంది ఈ మహమ్మారి. దీనికి ఇంతవరకూ విరుగుడు కనిపెట్టలేదు. అయితే అమెరికా మాత్రం తాత్కాలికంగా ఒకమందును అందుబాటులోకి తెచ్చినా అది అంతగా ప్రభావం చూపడం లేదు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో విస్తృతంగా ఫేక్ మందులు దర్శనమిస్తున్నాయి. తాజాగా యునైటెడ్ స్టేట్స్ యొక్క రోచె వైద్య సంస్థ కరోనా వైరస్ కోసం కనిపెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ మందు' కోవిడ్ -19 ఐజిఎం / ఐజిజి' అని రాశారు. ఒక ఫోటోతో పాటు ఒక సందేశాన్ని కూడా రాసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.. 'ఇది ప్రపంచానికి గొప్ప వార్త. కరోనా వైరస్ వ్యాక్సిన్ అభివృద్ధి చేయబడింది. ఇది రోగులను నయం చేయగలదు. యుఎస్ శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు. ట్రంప్ ఇప్పుడే ఈ విషయాన్ని ప్రకటించారు. రోస్ వైద్య సంస్థ వచ్చే ఆదివారం వ్యాక్సిన్‌ను విడుదల చేయనుంది.' అని దాని సారాంశం. చక్కర్లు కొడుతోన్న ఈ సందేశాన్ని వాట్సాప్ గ్రూపులోని కొందరు సభ్యులు ఫ్యాక్ట్ చెకింగ్ కు పంపారు.

అందులో ఇది ఫేక్ అని తేలింది. కరోనా వైరస్ కు ఇప్పటివరకు టీకా అందుబాటులోకి రాలేదని తేల్చారు. గూగుల్‌లో 'కోవిడ్ -19 ఐజిఎం / ఐజిజి' అనే కీవర్డ్‌ని శోధించిన తరువాత, ఈ టెస్టింగ్ కిట్ గురించి తెలిసింది. మార్చి 7 న ఓ ఆంగ్ల వెబ్ సైట్ కూడా దీన్ని ఫేక్ అని తేల్చింది. షేర్ చేసిన ఫోటోను చూస్తే, దక్షిణ కొరియా బ్రాండ్ యొక్క 'సుజెంటెక్' లోగో దానిపై కనిపిస్తుంది. ఈ సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ఉత్పత్తి పేరు కోసం శోధిస్తే, ఈ జాబితాలో 'కోవిడ్ -19 ఐజిఎం / ఐజిజి' వచ్చింది. కోవిడ్ -19 చికిత్సకు ఇప్పటివరకు మందులు లేవని ఈ పేజీలో స్పష్టంగా చెప్పారు. అయితే దీనిపై విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories