మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ, షిండే వర్గం

Eknath Shinde: నేడు ఢిల్లీలో ఫడ్నవీస్, ఏక్ నాథ్ షిండే భేటీ

Jyothi
Published on: 28 Jun 2022 1:43 PM IST
Fadnavis and Ek Nath Shinde Meet in Delhi today
X

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ, షిండే వర్గం

Ek Nath Shinde: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ, షిండే వర్గం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండే భేటీకానున్నారు. బీజేపీ హైకమాండ్ పిలుపుతో ఫడ్నవీస్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకుని జాతీయ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. కాసేపట్లో ఏక్ నాథ్ షిండే కూడా ఢిల్లీకి చేరుకోనున్నారు.

శివసేన రెబల్స్ ఎమ్మెల్యేల నేత ఏక్ నాథ్ షిండే.. సాయంత్రం గవర్నర్ ను కలవనున్నారు. ముంబైలో గవర్నర్ ను కలిసి.. ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు లేఖ ఇవ్వనున్నారు. ఉద్ధవ్ ప్రభుత్వం మైనారిటీలో పడిందని.. ఫ్లోర్ టెస్టు నిర్వహించాలని షిండే, గవర్నర్ ను కోరే అవకాశం ఉంది.

మరాఠా రాజకీయాలు గంట గంటకు మారిపోతున్నాయి. బీజేపీ, షిండే వర్గం ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు.. మంత్రులతో ఉద్ధవ్ థాక్రే భేటీ.. హస్తిన నుంచి షిండేకు పిలుపు.. ఇలా వరకు పరిణామాలతో మహారాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి.

Jyothi

Jyothi

Next Story