జియో 498 ఉచిత రీఛార్జ్.. ఫేకా.. ఒరిజినలా?

జియో 498 ఉచిత రీఛార్జ్.. ఫేకా.. ఒరిజినలా?
x
Highlights

కేంద్రం లాక్డౌన్ ప్రకటించడంతో జియోకు సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది.

కేంద్రం లాక్డౌన్ ప్రకటించడంతో జియోకు సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది.వాట్సాప్‌లో చాలా మందికి ఆ లింక్ షేర్ అయింది. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇంటివద్దే ఉంటుండటంతో 498 రూపాయలు ఉచిత రీఛార్జిగా జియో ఇస్తున్నట్టు ఆ లింక్ సారాంశం. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కొందరు వినియోగదారులు హిందీలో ఇలా పేర్కొన్నారు,' ఈ సంక్షోభ సమయంలో, జియో 498 రూపాయల ఉచిత రీఛార్జిని అందిస్తోంది.

ఉచిత రీఛార్జిని పొందడానికి క్రింది లింక్‌ను క్లిక్ చేయండి. ఈ ఆఫర్ మార్చి 31 వరకు మాత్రమే చెల్లుతుంది.' అని సామాజిక మాధ్యమాల్లో వార్త ఫేక్ వార్త వైరల్ అయింది. దీంతో చాలా మందికి ఈ లింక్ షేర్ అవ్వడంతో కొందరు విశ్వసించరు. అయితే దీనిపై జియో ఇంకా వివరణ ఇవ్వలేదు కానీ.. ఈ వార్తకు సంబంధించి ఎటువంటి సమాచారం జియోకు చెందిన అధికారిక వెబ్సైటు లో లేదు. దాంతో ఈ వార్త ఫేక్ అని అర్ధమవుతోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories