Solar Company: నాగ్ పూర్ సోలార్ కంపెనీలో పేలుడు.. 9 మంది కార్మికులు దుర్మరణం

Solar Company: ఫ్యాక్టరీకి చేరుకున్న ఎమర్జెన్సీ టీమ్, అధికారులు

Shekhar G
Published on: 17 Dec 2023 1:46 PM IST
Explosion At Nagpur Solar Company
X

Solar Company: నాగ్ పూర్ సోలార్ కంపెనీలో పేలుడు.. 9 మంది కార్మికులు దుర్మరణం

Solar Company: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోలార్ కంపెనీలో పేలుడు జరిగి తొమ్మిది మంది కార్మికులు చనిపోయారు. నాగ్ పూర్ లోని బజార్ గావ్ గ్రామంలోని సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది. కంపెనీలోని క్యాస్ట్ బూస్టర్ ప్లాంట్ లో ప్యాకింగ్ సమయంలో సడెన్ గా భారీ పేలుడు సంభవించింది. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న తొమ్మిది మంది కార్మికులు స్పాట్ లోనే చనిపోయారు.

మరికొంతమంది కార్మికులకు గాయాలయ్యాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. పేలుడు జరిగిన సమాచారం అందగానే ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందాలు వెంటనే కంపెనీ వద్దకు చేరుకున్నాయి. ప్రమాద తీవ్రత నేపథ్యంలో ఉన్నతాధికారులు కూడా బజార్ గాన్ ఘటనా స్థలానికి వెళ్లారు. గాయపడిన కార్మికులను వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. పేలుడు ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story