నేడు మహారాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ...

Maharashtra: మొత్తం 14 మంది మంత్రులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు

Jyothi
Published on: 9 Aug 2022 7:40 AM IST
Expansion of Maharashtra Cabinet Today
X

నేడు మహారాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ...

Maharashtra: ఇవాళ మహారాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించునున్నారు. మొత్తం 14 మంది మంత్రులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎం ఏక్‎నాథ్ షిండే ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కొక్కరిని కేబినెట్‌లోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. బీజేపీ సీనియర్ నేతలు సుధీర్ ముంగంటివార్, చంద్రకాంత్ పాటిల్, గిరీష్ మహాజన్ కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే, షిండే వర్గం నుంచి గులాబ్ రఘునాథ్ పాటిల్, సదా సర్వాంకర్, దీపక్ వసంత్ కేశార్కర్‌ కూడా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అయితే ఉప ముఖ్యమంత్రి ఫడ్నవిస్ కు హోంశాఖ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.

Jyothi

Jyothi

Next Story