Deve Gowda: కర్నాటక రాజకీయాలపై కామెంట్ చేయను

Deve Gowda: కర్నాటకలో బీజేపీ, కాంగ్రెస్ తో ఫైట్ చేయాల్సి ఉంటుంది

Rama Rao
Updated on: 30 March 2022 5:45 PM IST
Ex PM Deve Gowda Made an Interesting Comment Today
X

కర్నాటక రాజకీయాలపై కామెంట్ చేయను-దేవెగౌడ

Deve Gowda: మాజీ ప్రధాని, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు దేవెగౌడ ఇవాళ ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఈ సంవత్సరం ఆఖరులో కర్నాటక అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్న దృష్ట్యా ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇవాళ పార్లమెంట్ పరిసరాల్లో బిహార్ కు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుశీల్ కుమార్ మోడీ దేవెగౌడ ను కలిసి మాట్లాడారు. కొద్ది సెకన్లపాటు మాత్రమే వాళ్లు మాట్లాడుకున్నట్టు కనిపిస్తున్న విజువల్స్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. బీజేపీ, జేడీ-ఎస్ పొత్తుపై చర్చకు తెర తీశాయి. ఈ క్రమంలో దేవెగౌడను విలేకరులు వివరణ కోరగా కర్నాటక రాజకీయాలపై మాట్లాడటానికి తనకిష్టం లేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలతోనూ తాము ఫైట్ చేయాల్సి ఉంటుందన్నారు.

Rama Rao

Rama Rao

Next Story