జమ్మూ కశ్మీర్‌లో భారీ ఎన్‌ కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

Jammu and Kashmir: యుద్ధ రంగాన్ని తలపిస్తున్న ఎన్‌కౌంటర్‌ స్పాట్‌

Dhatripriya
Published on: 28 Dec 2022 2:55 PM IST
Encounter In Jammu And Kashmir
X

జమ్మూ కశ్మీర్‌లో భారీ ఎన్‌ కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం 

Jammu And Kashmir: జమ్మూ కాశ్మీర్‌ సిద్రా దగ్గర భద్రతా బలగాలు-ఉగ్రవాదులకు మధ్య హోరా హోరీగా కాల్పులు జరుగుతున్నాయి ఇప్పటి వరకు ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయినట్లు సమాచారం. జనవరి 26నాడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భద్రతా బలగాలు సిద్రా దగ్గర వాహనాలను చెక్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ట్రక్కు వచ్చి ఆగింది. జవాన్లు చెక్‌ చేసేందుకు ట్రక్కు దగ్గరకు వెళుతుండగానే కాలకృత్యాల కోసమని దిగిన డ్రైవర్‌ చెట్ల పొదల్లోనుంచి పారిపోయాడు. ట్రక్కు లోపల పరిశీలించేందుకు వెళ్లిన జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు దీంతో జవాన్లు ఎదురు దాడి చేశారు. జవాన్ల కాల్పుల్లో ఇప్పటి వరకు ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ట్రక్కులో ఇంకా ఎంత మంది ఉన్నారో తెలియలేదు కాల్పులు కొనసాగుతున్నాయి కాల్పుల్లో ట్రక్కు డీజిల్‌ ట్యాంక్‌ పేలడంతో మంటలంటుకున్నాయి. ఫైర్‌ సిబ్బంది మంటలార్పుతున్నారు ఫైర్‌ టెండర్ల నీటి ప్రవాహంలో ఏకే-47 బుల్లెట్లు కొట్టుకు వస్తున్నాయి. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం యుద్ధరంగాన్ని తలపిస్తోంది.

Dhatripriya

Dhatripriya

Next Story