Jammu & Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్

Jammu & Kashmir: ఇద్దరు ఉగ్రవాదుల హతం, శ్రీనగర్‌లోని ఖాన్‌మోహ్ ప్రాంతంలో పేలుడు పదార్థాలు స్వాధీనం

Jyothi
Updated on: 7 Sept 2022 2:00 PM IST
Encounter in Jammu and Kashmir
X

Jammu & Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ 

Jammu & Kashmir: జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు- ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. పోష్క్‌రీరి ప్రాంతంలో ఉగ్రవాదులున్నట్టు సమాచారం అందుకున్న భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి. వారికి తారసపడిన ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. కాల్పులు ఆగిన అనంతరం ఆ ప్రాంతాన్ని పరిశీలించగా ఇద్దరు ఉగ్రవాదులు హతమై కనిపించారు. వారిని హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన వారిగా గుర్తించారు.

వీరిద్దరూ గతంలో పౌరహత్యలకు పాల్పడినట్టు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 2021లో సైనికుడి హత్యతో పాటు ఆ తర్వాతి నెలలో జబ్లీపురాలో ఇద్దరు పౌరుల హత్య కేసులో వీరి ప్రమేయం ఉన్నట్టు పేర్కొన్నారు. మరోవైపు, శ్రీనగర్‌లోని ఖాన్‌మోహ్ ప్రాంతంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 35 కిలోల పేలుడు పదార్థాలు లభించాయి. అనంతరం వాటిని పేలకుండా చేసి ధ్వంసం చేశారు.


Jyothi

Jyothi

Next Story