Encounter in Jammu and Kashmir : జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్ లో శుక్రవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాం జిల్లా నాగ్‌నాద్ - చిమ్మెర ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతాదళాలు సోదాలు నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
ఈ ఎన్ కౌంటరులో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. గాయపడిన జవాన్లను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలి నుంచి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. గత రెండు నెలలుగా వివిధ ఎన్‌కౌంటర్‌లలో భారీగా ఉగ్రవాదులు హతమయ్యారు. అనంత్‌నాగ్‌లో రెండు రోజుల కిందట జైషే మొహమూద్ ఉగ్రవాదులు ఇద్దర్ని కాల్చి చంపారు.
Next Story




