Bengal: బెంగాల్ లో పోటా పోటీగా సాగుతున్న ప్రచారం

Bengal: టీఎంసీ,బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం * బీజేపీ కార్యకర్తలను చావబాదిన టీఎంసీ కార్యకర్తలు

Sandeep Eggoju
Published on: 3 March 2021 5:23 PM IST
Elections Campaigning Competition in Bengal
X

బీజేపీ కార్యకర్త గోపాల్ మజుందార్ (ఫైల్ ఫోటో)

Bengal: ఎన్నికలెదుర్కొంటున్న పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, టీఎంసీ మధ్యపెద్ద యుద్ధమే జరుగుతోంది. ఇరు పార్టీల కార్యకర్తలు, స్థానిక నేతలు బాహాబాహీలకు దిగుతున్నారు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. తాజాగా బీజేపీ కార్యకర్తలపై తృణమూల్ కార్యకర్తలు దారుణంగా దాడికి పాల్పడిన సంఘటన వెలుగు చూసింది. 24ఉత్తర పరగణాల్లోని నింతా తానా ఏరియాలో బీజేపీ కార్యకర్త గోపాల్ మజుందార్ తల్లిపై టీఎంసీ కార్యకర్తలు దాడి చేసి గాయపరిచారు. అసలే వృద్ధురాలైన ఆమెను కనికరం లేకుండా ముఖంపైనే ముష్టి ఘాతాలు విసిరారు.. దెబ్బలకు ఆమె ముఖమంతా గాయాలమయమైంది.
Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story