Election Results 2023: కొనసాగుతున్న ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్.. బీజేపీ దూకుడు..

Election Results 2023 Huge BJP lead In Nagaland and Tripura
x

Election Results 2023: కొనసాగుతున్న ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్.. బీజేపీ దూకుడు..

Highlights

Election Results 2023: ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది.

Election Results 2023: ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. నాగాలాండ్‌లో బీజేపీ-ఎన్‌డీపీపీ కూటమి హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం ఈ కూటమికి స్పష్టమైన ఆధిక్యం లభించింది. ప్రస్తుతం బీజేపీ-ఎన్‌డీపీపీ కూటమి ఒక స్థానంలో విజయం సాధించగా.. మరో 48 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎన్‌పీఎఫ్‌ 6, కాంగ్రెస్‌ 1, ఎన్‌పీపీ 3, ఇతరులు ఒక స్థానంలో ముందంజలో ఉన్నారు. నాగాలాండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 31 స్థానాలు అవసరం. ఇక త్రిపురలో బీజేపీ దూకుడు కొనసాగుతోంది. ఆ పార్టీ 38 చోట్ల.. కాంగ్రెస్‌-లెఫ్ట్‌ కూటమి 15 స్థానాల్లో లీడ్‌లో ఉన్నాయి. మేఘాలయలో కన్రాడ్‌ సంగ్మా నేతృత్వంలోని ఎన్‌పీపీ 19 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 5 చోట్ల బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories