ఢిల్లీ : ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం.. సర్వేలన్నీ ఆ పార్టీ వైపే

ఢిల్లీ : ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం.. సర్వేలన్నీ ఆ పార్టీ వైపే
x
Highlights

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గడువు ముగిసింది. అధికారం ఆమ్ ఆద్మీ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు హోరా హోరీ ప్రచారం నిర్వహించాయి.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గడువు ముగిసింది. అధికారం ఆమ్ ఆద్మీ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు హోరా హోరీ ప్రచారం నిర్వహించాయి. గెలుపే లక్ష్యంగా మూడు పార్టీలు ఎన్నికల ప్రచార పర్వాన్ని ముగించాయి. రెండోసారి కూడా అధికారంలోకి రావాలని ఆప్.. ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని బీజేపీ.. ఢిల్లీని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పూర్వవైభవం కోసం శతవిధాల ప్రయత్నిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ, ఏడు ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ, ఆప్ పార్టీల మధ్యే ప్రధానంగా ఉండే అవకాశాలున్నాయి. బీజేపీ, అటు కాంగ్రెస్‌తో పోలిస్తే.. ఆప్ రెండు పార్టీల కంటే ముందంజలో ఉంది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన విద్య, ఆరోగ్యం వంటి అంశాలు ప్రజల్లో సానుకూల ప్రభావాన్ని క్రియేట్ చేసింది. కేజ్రీవాల్‌కు ఉన్న విస్తృతమైన ప్రజాదరణ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి కలిసొచ్చే అంశం. ఇక.. బీజేపీలోగానీ, కాంగ్రెస్‌లో కానీ… కేజ్రీవాల్ స్థాయిలో ప్రజాదరణ కలిగిన స్ట్రాంగ్ లీడర్ లేకపోవడం ఆప్‌కు కలిసొస్తోంది.

ఇదిలా ఉంటే.. బీజేపీకి ప్రతికూల అంశాలే ఎక్కువగా ఉన్నాయి. పౌరసత్వ సవరణ చట్టం, ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణం, ట్రిపుల్ తలాక్ వంటి విజయాలపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. స్థానిక అంశాల ప్రభావాన్ని ఇదే స్థాయిలో పోలింగ్ వరకు కొనసాగేలా చేయగలిగితే, ఢిల్లీలో ఆప్ మరోసారి విజయం సాధించవచ్చనేది నిపుణుల అభిప్రాయం. 200 మంది ఎంపీలు, 70 మంది కేంద్రమంత్రులు, 11 రాష్ట్రాల సీఎంలు ఢిల్లీలో తిష్టవేసినా… ఆప్ చేసిన అభివృద్ధికే ప్రజలు పట్టంకడగతారని ఆమ్ ఆద్మీ విశ్వాసంతో ఉంది

ఈ ఎన్నికలపై Times Now-IPSOS సంస్థలు తమ ఒపీనియన్ పోల్ వెల్లడించాయి. హస్తిన పీఠం ఆమాద్మీనే మరోసారి వరిస్తుందని సర్వే తేల్చింది. మరోసారి కేజ్రివాల్ చీపురు ప్రత్యర్థులను ఊడ్చేస్తుందని జోస్యం చెప్పింది. టైమ్స్ నౌవ్ -IPSOS ఒపీనియన్ పోల్ చూస్తే.. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 52శాతం ఓట్లు రావొచ్చని తెలిపింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 34శాతం సాధిస్తుందని వెల్లడించింది.

ఆమాద్మీ పార్టీకి ఈ సారి సీట్లు తగ్గే అవకాశం ఉందని 54-60 స్థానాలు పరిమితం అవుతుందని తెలిపింది. బీజేపీ 10-14 సీట్లకు మాత్రమే రావొచ్చని తెలిపింది. IPSOS జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 తేదీల మధ్య సర్వే నిర్వహించింది. కేజ్రివాల్ పార్టీకి 52 శాతం ,బీజేపీకి 34 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. ఇక ఫిబ్రవరి 8వ తేదీ పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 11న తుది ఫలితాలను ప్రకటిస్తారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories