Betting App Case: యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, సోనూసూద్‌కి ఈడీ నోటీసులు

Betting App Case: బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది.

Arun Chilukuri
Published on: 16 Sept 2025 3:56 PM IST
Betting App Case: యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, సోనూసూద్‌కి ఈడీ నోటీసులు
X

Betting App Case: బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురికి సమన్లు జారీ చేసిన ఈడీ తాజాగా మరో ముగ్గురు సెలబ్రిటీలకు సమన్లు ఇచ్చింది. భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పతో పాటు సినీ నటుడు సోనూసూద్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది.

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ వన్ ఎక్స్ బెట్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఉతప్పకు సమన్లు జారీ చేసిన ఈడీ..ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 23న యువరాజ్‌ను, ఈనెల 24న సోనూసూద్‌ను విచారణకు రావాలని పేర్కొంది. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు మాజీ క్రికెటర్లకు సమన్లు అందాయి. ఇప్పటికే మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేశ్ రైనాను ఈడీ విచారించింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story