శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌కు ఈడీ సమన్లు

శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌కు ఈడీ సమన్లు

Arun Chilukuri
Updated on: 27 Jun 2022 4:45 PM IST
ED Summons Sanjay Raut in Land Scam Case
X

శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌కు ఈడీ సమన్లు

Sanjay Raut: ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న శివసేనకు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత సంజయ్ రౌత్ కు మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది. భూకుంభకోణానికి సంబంధించిన కేసులో సమన్లు జారీ చేసింది. విచారణ నిమిత్తం రేపు తమ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ నెలలో సంజయ్ రౌత్ భార్య , మరో ఇద్దరికి చెందిన కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈడీని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు సంజయ్ రౌత్. ఈడీ చేత ఎంత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినా తాము ఉద్ధవ్ థాకరే వెంటే ఉంటామని చెప్పారు. ఈడీ ఒత్తిడికి లొంగి శివసేనను వదిలిపెట్టే వారంతా బాల్ థాకరే నిజమైన భక్తులు కాదని అన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story