ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ నివాసంలో ఈడీ సోదాలు

ED Raids at the Residence of Delhi Health Minister Satyendra Jain
x

ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ నివాసంలో ఈడీ సోదాలు

Highlights

*మనీలాండరింగ్ కేసులో మే 30న అరెస్టైన సత్యేంద్ర జైన్

Delhi: ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మే 30న మనీలాండరింగ్ కేసులో సత్యేంద్రను ఈడీ అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరిన్ని ఆధారాలు కోసం ఢిల్లీలోని ఆయన ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది. కోల్‌కత్తాకు చెందిన ఓ కంపెనీకి సత్యేంద్ర జైన్ అక్రమంగా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసిట్లు ఈడీ చెబుతోంది.

ఈ కేసులో సత్యేంద్ర జైన్, ఆయన బంధువులకు సంబంధాలున్నాయని భావిస్తున్న కంపెనీలకు చెందిన 4.81 కోట్ల విలువైన స్థిరాస్థులను ఈడీ గత ఏప్రిల్‌లోనే జప్తు చేసింది. సత్యేంద్ర జైన్‌పై 2017లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తుంది. జూన్ 9 వరకు సత్యేంద్ర ఈడీ కస్టడీలో ఉండనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories