Sanjay Raut: శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌కు ఈడీ షాక్

Sanjay Raut: పాత్రఛాల్ భూ కుంభకోణంలో రౌత్‌పై ఆరోపణలు

Rama Rao
Published on: 5 April 2022 4:32 PM IST
ED Provisionally Attaches Assets Owned by Shiv Sena MP Sanjay Raut
X

Sanjay Raut: శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌కు ఈడీ షాక్

Sanjay Raut: శివసేన ఎంపీ, సీనియర్ నేత సంజయ్ రౌత్‌కు ఈడీ షాకిచ్చింది. ఆయన సతీమణికి చెందిన దాదాపు 11 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అయితే ఈ 11 కోట్లలో 9 కోట్లు రౌత్ కుమారుడు ప్రవీణ్ రౌత్‌కు సంబంధించినవి కాగా మరో 2 కోట్లు సంజయ్‌ రౌత్‌ సతీమణికి సంబంధించినవిగా గుర్తించారు. వెయ్యి కోట్ల పట్రాచాల్ భూ కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రౌత్‌కు సంబంధించిన ఫ్లాట్, ముంబైలోని ఒక్కొక్క ఫ్లాట్‌ను అటాచ్ చేసింది.

ఇక ఈడీ తీసుకున్న ఈ నిర్ణయానికి కొన్ని గంటల ముందే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఉప రాష్ట్రపతికి లేఖ రాశారు. వెయ్యి కోట్ల పట్రాచాల్‌ భూ అవినీతికి సంబంధించిన విషయంలో ఈడీ తన అధికారాలను దురుపయోగం చేస్తోందంటూ రౌత్ ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. ఈడీతో సహా కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రతిపక్షాలను టార్గెట్‌గా చేస్తున్నాయంటూ రౌత్ వెంకయ్యనాయుడికి ఫిర్యాదు చేశారు.

Rama Rao

Rama Rao

Next Story