ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ మరోసారి నోటీసులు

Kejriwal: ఈరోజు విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు

Jyothi
Published on: 18 Jan 2024 10:27 AM IST
ED once again Notices Delhi CM Kejriwal
X

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ మరోసారి నోటీసులు

Kejriwal: లిక్కర్ స్కామ్ కేసులో కేసులో ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరుపై సస్పెన్స్ కొనసాగుతుంది. లోక్‌సభ ఎన్నికల సన్నాహాలను పరిశీలించేందుకు ఆయన గోవాకు వెళ్లనున్న నేపథ్యంలో ఈడీ సమన్లను మరోసారి దాటవేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేజ్రీవాల్‌కి గత వారం నాల్గవసారి ఈడీ సమన్లు జారీ చేసింది. ఇవాళ ఈడీ ముందు హాజరు కావాలని కోరింది. మూడు రోజుల పర్యటన నిమిత్తం గోవాకు వెళ్లాల్సి ఉన్నందున ఈడీ ముందు ఆయన హాజరుకావడానికి అవకాశం లేదని ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈడీ నోటీసులను కేజ్రీవాల్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఈడీ చర్యల వెనక రాజకీయ ప్రేరణ ఉందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. చట్ట ప్రకారమే ఈడీని ఎదుర్కొంటామని పార్టీ వర్గాలు తెలిపాయి.

Jyothi

Jyothi

Next Story