Arvind Kejriwal: కేజ్రీవాల్‌పై ఈడీ ఆరోపణలు.. బెయిల్ కోసం ఇలా చేస్తున్నారని కోర్టుకు తెలిపిన ఈడీ

Arvind Kejriwal: కేజ్రీవాల్‌పై ఈడీ ఆరోపణలు

Shashank Gullapelli
Published on: 18 April 2024 5:01 PM IST
ED On Arvind Kejriwal
X

Arvind Kejriwal: కేజ్రీవాల్‌పై ఈడీ ఆరోపణలు.. బెయిల్ కోసం ఇలా చేస్తున్నారని కోర్టుకు తెలిపిన ఈడీ

Arvind Kejriwal: ఆరోగ్య కారణాలు చూపించి బెయిల్ పొందేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని ఈడీ అధికారులు ఆరోపించారు. డయాబెటీస్ ఉన్నప్పటికీ చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటున్నారని పేర్కొంది. షుగర్ స్థాయిల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉండటంతో తన రెగ్యులర్ డాక్టర్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదించేందుకు అనుమతించాలని కోరుతూ కేజ్రీవాల్ ఇటీవల ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంటి భోజనానికి కేజ్రీవాల్‌కి అనుమతి ఉందని... టైప్ 2 డయాబెటీస్‌తో బాధ పడుతున్నప్పటికీ... అరటిపండు, మామిడి పండ్లు, స్వీట్లు, ఆలూ పూరి వంటివి తింటున్నారని కోర్టుకు ఈడీ తెలిపింది. ఇలాంటివి తింటే షుగర్ లెవల్స్ పెరుగుతాయని ఆయనకు తెలిసినా... బెయిల్ పొందేందుకు ఇలా చేస్తున్నారని కోర్టుకు వివరించింది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story