Priyanka Gandhi: కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీకి షాకిచ్చిన ఈడీ

Priyanka Gandhi: భూముల కొనుగోలు సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు.. విదేశాల నుంచి అక్రమంగా వచ్చాయని ఈడీ ఆరోపణ

Shekhar G
Published on: 28 Dec 2023 5:07 PM IST
ED mentioned Priyanka Gandhi Name In The Chargesheet Of Money Laundering Case
X

Priyanka Gandhi: కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీకి షాకిచ్చిన ఈడీ

Priyanka Gandhi: కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ఎన్‌ఆర్‌ఐకి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఈడీ ప్రియాంక పేరును ప్రస్తావించింది. ఎన్నారై వ్యాపారవేత్త సీపీ థంపి, బ్రిటన్ జాతీయుడు సుమిత్ చద్దాపై నమోదైన మనీలాండరింగ్ కేసులో భాగంగా దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ప్రియాంకగాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా పేర్లను చేర్చింది. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా 2006 సంవత్సరంలో ఫరీదాబాద్ ప్రాంతంలోని అమీపూర్ గ్రామంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా 40 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు.

2010లో అదే భూమిని తిరిగి పహ్వాకు అమ్మేశారు. అదే విధంగా 2006లో ప్రియాంక గాంధీ ఓ ఇంటిని కొనుగోలు చేశారు. 2010లో అదే ఇంటిని తిరిగి పహ్వాకు అమ్మటం జరిగింది. ఈ భూముల కొనుగోలు సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు అన్నీ విదేశాల నుంచి అక్రమంగా వచ్చాయనిద ఈడీ ఆరోపించింది.

Shekhar G

Shekhar G

Next Story